చెత్త నుండి సంపద సృష్టి పనులు వేగవతం

Apr 7,2025 18:09 #alamuru, #dust, #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : చెత్త నుండి సంపద సృష్టి పనులు వేగవంతం చేశామని ఇన్చార్జి డిఎల్పిఓ, ఎంపీడీవో ఐ.రాజు అన్నారు. మండలంలోని నవాబుపేట, జొన్నాడ, చెముడులంక గ్రామ పంచాయతీలలో ఇంటింటికీ చెత్త సేకరణపై సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి చెత్త నుండి సంపద తయారీపై ఇప్పటికే శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అలాగే తడి చెత్త, పొడి చెత్త సేకరించే విధానాన్ని మండలంలో గల ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కూడా కల్పించడం జరిగిందన్నారు. అలాగే సేకరించిన చెత్త నుండి సంపద ఏ విధంగా తయారు చేయాలనే అంశంపై ప్రత్యేక శిక్షణ మండల పరిధి అన్ని గ్రామాల పంచాయతీల సిబ్బందికి ఇచ్చామన్నారు. దీనిని వలన గ్రామంలో పరిశుభ్రతతో పాటు పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ పెద్దిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️