కాలువలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు

ప్రజాశక్తి-పర్చూరు : పెళ్లి బృందంతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పర్చూరు- చీరాల ఆర్‌ అండ్‌ బి రోడ్డు లోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాల సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. అందిన వివరాల ప్రకారం… ఓస్కూల్‌ బస్సులో పెళ్లి బృందం చీరాల నుంచి నరసరావుపేటకు వెళ్లింది. వివాహ వేడుకల అనంతరం తిరిగి చీరాల తిరిగి వస్తుండగా మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో బస్సు కాలువలకు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. తృటిలో పెను ప్రమాద,ం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

➡️