ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : జాతీయస్థాయి క్యారం పోటీలకు తుని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఎంఎస్ కే హారిక ఎంపికయ్యారు. మంగళవారం తుని సచివాలయంలో హారికను అధికారులు అభినందించారు. ఇటీవల 51వ స్థాయి రాష్ట్ర క్యారం ఛాంపియన్ షిప్ లో హారిక మొదటి స్థానం సాధించారు. ఏప్రియల్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జాతీయ స్థాయిలో కేరమ్ పోటీలు గ్వాలియర్ మధ్యప్రదేశ్‌లో జరగనున్నాయి. ఆ పోటీల్లో హారిక పాల్గొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొన అరుణ నాగేశ్వరరావు, కార్యదర్శి మేరీ జోన్స్ సిబ్బంది ఉన్నారు.
