ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు గౌరవ అధ్యక్షులు జి.ఏసుదాస్‌ కోరారు. పట్టణంలోని పూల అంగళ్లు వద్ద ఉన్న ఆటోడ్రైవర్లను సిఐటియులోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉంటే కడప జిల్లాలో 35వేల మంది ఆటోడ్రైవర్లు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు ప్రయాణికులను గమ్య స్థలానికి చేరవేస్తూ ప్రభుత్వానికి రూ.కోట్ల పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ఆటోడ్రైవర్లకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ, పెన్షన్‌తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భారీగా చలానాలు పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 21, 31ని రద్దు చేసి డ్రైవర్లకు మేలు చేయాలని కోరారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలపై థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ 30 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆటోల మీద ఉన్న పోలీస్‌ ఇ చలనాలు రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో మునిమధు, శంకర్‌, రామంజి , నాని, చంద్ర, మునిశేఖర్‌, మునయ్య, మహేష్‌, చిన్న మన్నయ్య ,చౌడయ్య పాల్గొన్నారు.

➡️