అంగన్వాడీల పోరాటం స్ఫూర్తిదాయకం

శిక్షణా తరగతుల్లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రజాశక్తి – పెనుగొండ
ఉద్యోగులు, కార్మికుల ఐక్య పోరాటాలకు అంగన్వాడీల పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు అన్నారు. 10, 11 తేదీల్లో సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే అంగన్వాడీల జిల్లా శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమ య్యాయి. ఈ శిక్షణా తరగతులకు ఎం.విజయలక్ష్మి, దివ్య స్వరూప అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాజారామ్మోహన్‌రారు మాట్లాడుతూ రాష్ట్రంలో 42 రోజులు అంగన్‌వాడీలు నిరవధిక పోరాటం చేయడం కార్మిక రంగం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రానున్న కాలంలో ఉద్యోగులు, కార్మికుల ఐక్యతకు అంగన్వాడీల పోరాటం దిక్సూచిగా ఉంటుందన్నారు. వారి పోరాట పటిమ అసంఘటిత రంగంలో పెద్ద మార్పు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇతర రంగాల కార్మికులు కూడా ఐక్యమవుతున్నారన్నారు. కార్మిక లోకానికి సిఐటియు అండదండలు ఎప్పుడు ఉంటాయన్నారు. ఈ శిక్షణా తరగ తుల్లో అంగన్వాడీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.ఝాన్సీ లక్ష్మి, డి.కళ్యాణి, పెనుమంట్ర ప్రాజెక్టు లీడర్‌ కె.తులసి, పెనుగొండ మండల లీడర్‌ పీడీ పరమేశ్వరి, సిఐటియు నాయకులు కప్పల రత్నరాజు, కడలి త్రినాథ్‌ పాల్గొన్నారు.

➡️