ఎన్నికల కోడ్‌ పట్టదా..!

ప్రజాశక్తి – కాళ్ల
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో వైసిపి, జనసేన పార్టీల రంగులతో దర్శనమిస్తున్నాయి. మెండి ప్రాంతంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకర్‌ వైసిపి రంగుల్లో కనిపిస్తుంది. సీసలి గ్రామంలో తాగునీటి ట్యాంకర్‌పై జనసేన పార్టీ రంగులతో పాటు పవన్‌కళ్యాణ్‌, రాజకీయనాయకుల చిత్రాలు ఉన్నాయి. రంగులు, ఫొటోలు తొలగించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినప్పటికీ ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి సరికాదని పలువురు పేర్కొంటున్నారు.

➡️