పాఠశాలకు మైక్‌ సెట్‌ బహూకరణ

Mar 31,2024 21:44

ప్రజాశక్తి – గణపవరం
మండలంలోని జల్లికొమ్మర ఉన్నత పాఠశాలకు విద్యార్థులు ఆదివారం రూ.20 వేల విలువైన వైర్‌లెస్‌ మైక్‌సెట్‌ను పాఠశాలకు బహూకరించినట్లు ప్రధానోపాధ్యాయులు కటకం సుందరకుమార్‌ తెలిపారు. 2022-2023 సంవత్సరంలో ఎనిమిదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు, ప్రస్తుతం 2023-2024 సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు కలిసి మైక్‌సెట్‌ను అందించినట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వామి అయిన విద్యార్థులను ఉపాధ్యాయులు సౌజన్య, శ్రీదేవి, పార్వతి, సిహెచ్‌.లీలాకుమార్‌, రమేష్‌, శిరీష విద్యార్థులను అభినందించారు.

➡️