ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలి

Feb 19,2024 22:25

స్పందన కార్యక్రమంలో ఎఎస్‌పి స్వరూపరాణి
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్‌పి స్వరూపరాణి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్‌పి స్వరూపరాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆయా పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టామన్నారు. ఆన్‌లైన్‌లో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్లకు మెసేజుల్లో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయవద్దని సూచించారు.స్పందన ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలిఆర్‌డిఒ భవానిశంకరినూజివీడు రూరల్‌ :నూజివీడు పట్టణంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ భవానిశంకరి మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న అర్జీలను ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. స్పందన సమస్యలను పరిష్కరించాలని, పరిష్కారం కాకుంటే లబ్ధిదారులకు వివరించాలని తెలిపారు.

➡️