శ్రీదేవి రామారావు దంపతులకు సత్కారం

ప్రజాశక్తి – మొగల్తూరు

ఎంతోమంది విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దిన నిప్పులేటి శ్రీదేవి తారకరామారావు ధన్యజీవని వైన్‌ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ చినమిల్లి సత్యనారాయణ అన్నారు. మొగల్తూరులోని పెనుమత్స రంగరాజు జెడ్‌పి ఉన్నత పాఠశాలలో ఆదివారం నిప్పులేటి శ్రీదేవి తారక రామారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్ధమాని రవిశంకర్‌ సర్కార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు శ్రీదేవిని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ జెడ్‌పిటిసి సభ్యులు గుబ్బల నాగరాజు, మాజీ సర్పంచి మామిడిశెట్టి సత్యనారాయణ, సొసైటీ మాజీ అధ్యక్షులు మేడిది బాబ్జి, కలిదిండి కుమార్‌ బాబు, కొట్టు రామాంజనేయులు పులపర్తి సుబ్రహ్మణ్యం సిపిఎం నాయకులు కొత్త విజయకుమార్‌, ఎంపిటిసి సభ్యులు అందే దొరబాబు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పలువురు గ్రామస్తులు శ్రీదేవి తారక రామారావు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం సహాపంక్తి భోజనాలు చేశారు.

➡️