కిళ్లీ, బీడీ, సిగరెట్‌, సోడా, కూల్‌ డ్రింక్స్‌ వర్తక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ప్రజాశక్తి – తణుకు

కిళ్లీ, బీడీ, సిగరెట్‌, సోడా, కూల్‌ డ్రింక్స్‌ వర్తక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం తణుకులోని బీసీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం కూడా నిర్వహించారు. అనంతరం నూతన గౌరవాధ్యక్షులుగా బోయిడి అన్నవరం, అధ్యక్షులుగా పైబోయిన ఏసుబాబు, కార్యదర్శిగా గమిడి జయరాం వెంకటసుబ్బారావు, కోశాధికారిగా కొమ్మన రాంబాబు, ఉపాధ్యక్షులుగా పెదరెడ్ల ఈశ్వరరావు, చుండూరి సత్యనారాయణమూర్తి, సహాయ కార్యదర్శిగా శిరాలం శ్రీనివాసు, సుంకర వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వర్తక సంఘాల నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంఘం బలోపేతానికి తమ సహాయ సహకారాలు అందించాలని నూతనంగా ఎన్నికైన ఏసుబాబు కోరారు.

➡️