తీర ప్రాంతం అభివృద్ధికి కృషి

ప్రజాశక్తి – నరసాపురం
వైసిపి మళ్లీ అధికారంలోకొస్తే తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని వేములదీవి ఈస్ట్‌ గ్రామంలో శుక్రవారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇంటికే పెన్షన్‌, బియ్యం, పంపిణీ చేశామన్నారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో ఎంపీ, ఎంఎల్‌ఎ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు ముదునూరు కృష్ణంరాజు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బర్రి వెంకటరమణ, తిరుమాని నాగరాజు, దొంగ మురళీకృష్ణ పాల్గొన్నారు.

➡️