నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

ప్రజాశక్తి – భీమవరం

స్పందనలో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలలా ప్రజల నుంచి వచ్చిన 228 వినతులను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్‌ ద్వారా సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందనలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై తీసుకున్న చర్యలు అర్జీదారుల్లో సంతృప్తి పెరిగేలా ఉండాలన్నారు. నిర్ణీత గడువులోపు అర్జీలు పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమం ఉదయం 10 గంటలకే ప్రారంభమవుతుందని, జిల్లాలో వివిధ శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డి, ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టరు, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కానాల సంగీత్‌ మధుర్‌, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్‌.అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️