పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌

లంకలకోడేరు పిహెచ్‌సి పరిధిలో దగ్గులూరులో పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా డిఎంహెచ్‌ఒ రెండో రోజు సోమవారం ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లోనూ ఐదు సంవత్సరాల్లోపు పిల్లలుంటే వారిని గుర్తించి చుక్కలు వేయించుకున్నారా లేదా అని అడిగి, వేయించుకోని వారికి చుక్కలు వేయాలని తెలిపారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారు, సంచార జీవుల పిల్లలను గుర్తించి చుక్కలు వేయాలన్నారు. హైరిస్క్‌ ఏరియా ఏదైనా ఉంటే అక్కడ ప్రత్యేక సర్వే చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.నవ్యజీవన్‌, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, సూపర్‌వైజర్‌ ఎస్‌కె.అమలేశ్వర రావు, ఎఎన్‌ఎం మార్తమ్మ, ఎంఎల్‌హెచ్‌పి.లిఖిత ప్రియ, ఆశాలు పాల్గొన్నారు.

➡️