పెరగని వేతనాలు.. మారని జీవితాలు

ఆర్‌టిసి గ్యారేజీ కార్మికుల ఆవేదన
ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్యలు
పట్టించుకోని అధికారులు, యాజమాన్యం
నేడు చలో విజయవాడ
ప్రజాశక్తి – నరసాపురం
ఆర్‌టిసి బస్సు అంటే మనందరికీ గుర్తుకొచ్చేది డ్రైవర్‌, కండక్టర్‌. వీరితో పాటు నిత్యం రోడ్లపై ఆగిపోయే ఆర్‌టిసి బస్సులను మరమ్మతులు చేసే మెకానిక్‌లు గుర్తుకురారు. వీరందరూ నిత్యం గంటల కొద్ది బట్టలపై, శరీరంపై ఆయిల్‌ మరకలతో బస్సుల కింద ఉండి పని చేస్తుంటారు. నిత్యం ఎక్కడో చోట ఆగిపోయే బస్సులకు మరమ్మతులు చేసేందుకు వీరు ఆగమేఘాలపై వచ్చి బస్సును రిపేర్‌ చేసి వెళ్తుంటారు. బస్సు పరిస్థితి మారినా డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదు. చాలీచాలని జీతాలతో సంవత్సరాల కొద్ది జీవితాలను గడుపుతున్నారు. ఎప్పుడోకప్పుడు పర్మినెంట్‌ చేయకపోతారా అని ఎదురు చూస్తూ అదే ఆశతో మెకానిక్‌లు, అసిస్టెంట్‌ మెకానిక్‌లు ఉండిపోతున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమ జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్‌, కరెంట్‌ బిల్లులు, కూరగాయల ధరలు, ఇంటి అద్దెలకు ఇచ్చే రూ.పది వేలు ఏ మూలకోస్తాయని వాపోతున్నారు. పదో తరగతి తర్వాత ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌ చదివి ఆరు నెలలు అప్రంటీస్‌ చేసిన వారిని ఆర్‌టిసిలో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులుగా చేర్చుకుంటారు. ఎపిఎస్‌ఆర్‌టిసిలో కాంట్రాక్ట్‌ విధానం రద్దు చేయాలని, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని, ఇఎస్‌ఐ పిఎఫ్‌ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ కార్మికుల జీతాలు పెరగలేదు. సర్కిల్‌ ప్రకారం కార్మికులకు రావాల్సిన జీతాలను, కార్మిక శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. ఆర్‌టిసిలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌లో వోల్వా బార్సు, అటెండర్‌, ట్రాఫిక్‌ గైడ్స్‌, బస్సులకు ఆయిల్‌ కొట్టేవాళ్లు, రిజర్వేషన్‌లో పని చేసేవారు, కార్గోలో పనిచేసే వారు, కోచ్‌ బిల్డర్‌, పెయింటర్స్‌, ఆఫీస్‌లో డిఇఒలు ఉన్నారు. గత 15 ఏళ్లుగా అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఉద్యోగ భద్రత, సెలవు లేకుండా కార్మికులు గొడ్డు చాకిరి చేస్తున్నారు. ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి, కార్మిక హక్కుల సాధన కోసం ఈ నెల నాలుగో తేదీన విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సమావేశం నిర్వహించాలని ఎపిపిటిడి కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వానికి తమ సమస్యను రాష్ట్ర స్థాయిలో తెలపాలని కార్మికులు నిర్ణయించుకున్నారు.బసర్క్యులర్‌ ప్రకారం జీతం ప్రతినెలా పదో తేదీ లోపు కార్మికుల ఖాతాలో జమ చేయాలి.బప్రతి ఆరు నెలలకోసారి బిఎ బకాయిలు అలవెన్స్‌ రూపంలో చెల్లించాలి. బకార్మికులందరికీ లేబర్‌ హాలిడేస్‌ అమలు చేయాలి.బఇఎస్‌ఐలో కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేయించాలి. పిఎఫ్‌ సొమ్ము కార్మికుల ఖాతాలో జమవుతున్నదీ లేనిదీ కార్మికులకు ఏడాదికోసారి రశీదు ఇచ్చి తెలియజేయాలి.బకనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.బథర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దుచేసి సంస్థ ద్వారానే కార్మికులకు జీతాలు చెల్లించాలి.బఆన్‌కాల్‌ డ్రైవర్లకు కనీస సౌకర్యాలుకల్పించాలి.ఉద్యోగ భద్రత కల్పించాలికె.వెంకట్‌, అసిస్టెంట్‌ మెకానిక్‌,నరసాపురంకాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌లో పనిచేసే కార్మికులను పర్మినెంట్‌ చేయాలి. జీతాలు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా శ్రమను గుర్తించి జీతాలు పెంచాలి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలికె.రూపేష్‌, అసిస్టెంట్‌ మెకానిక్‌, నరసాపురంకనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. ఇఎస్‌ఐ, లేబర్‌ హాలిడేస్‌, సాధారణ సెలవులు అమలు చేయాలి. రూ.పది వేలు వేతనం సరిపోవడం లేదు. పెరిగిన ధరలతో కుటుంబం నడవడం కష్టంగా ఉంది.థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దు చేయాలిజె.చక్రవర్తి,అసిస్టెంట్‌ మెకానిక్‌, నరసాపురంరిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలి. ఆర్‌టిసిలో థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దు చేసి ఆర్‌టిసి సంస్థ నేరుగా జీతాలు ఇవ్వాలి. జీతాలను పెంచాలి. సమాన పనికి సమాన వేతనం అందించాలి.సమస్యలను పరిష్కరించాలినేతల చిట్టిబాబు, అసిస్టెంట్‌ మెకానిక్‌, నరసాపురంఆర్టీసీ డిపోలో 10 సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న. ఇప్పటికైనా పర్మినెంట్‌ చేయాలి. ఎప్పటికైనా చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.కార్మిక చట్టాలు అమలు చేయాలిపొన్నాడ రాము, సిఐటియు నరసాపురం పట్టణ కార్యదర్శిఆర్‌టిసిలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు రూ.26 వేలు జీతం ఇవ్వాలి. కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి. ఆర్‌టిసిలు పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను ప్రభుత్వం, యాజమాన్యం గాలికొదిలేసింది. ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలి.

➡️