శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు
ప్రజాశక్తి – ఆకివీడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని శాసనమండలి ఛైైర్మన్ మోషేనురాజు అన్నారు. మండలంలోని సిద్ధాపురం, గుమ్ములూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతరం నూతనంగా రూ.43 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా సిద్ధాపురం సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గుమ్ములూరులో జగనన్న కాలనీకి సంబంధించి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పివిఎల్ నరసింహరాజు, జెడ్‌పిటిసి సభ్యులు వేగేశ్న వెంకటరాజు, ఎంపిపి కటారి జయలక్ష్మి, ఆకివీడు పంచాయతీ ఛైర్‌పర్సన్ హైమావతి, ఎఎంసి ఛైర్మన్ షేక్ హసీనా బీబీ, వైసిపి నాయకులు పాల్గొన్నారు.