ముమ్మరంగా తనిఖీలు

ప్రజాశక్తి – నరసాపురం
నిబంధనలకు విరుద్ధంగా బిల్లు లేకుండా నగదు, బంగారం తరలిస్తే చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్‌ఐ ఎం.సత్యనారాయణరాజు అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో శుక్రవారం నరసాపురం రైల్వే స్టేషన్‌లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు ముమ్మరం చేశాయి. శుక్రవారం ఉదయం నరసాపురం రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్‌ హుబ్లీ నుంచి వచ్చిన ట్రైన్‌లోని ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. నరసాపురం పట్టణ ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.

➡️