ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి – భీమవరం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గాంధీజీ, అంబేద్కర్ విగ్ర హాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. కోర్టు ఆవరణలో జాతీయ గీతాలాపన, జాతీయ పతాకావిష్కరణ చేశారు. భీమవరం మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యదేవి మాట్లాడారు. ఉండి : ఉండి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో ్లఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ ఎస్.రవీం దర్, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఏడిద శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మండలంలోని పాందువ్వ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ మండల కార్యదర్శి మాదాసి గోపీ మాట్లాడారు.పోడూరు : స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆర్‌ఐ కె.రాంబాబు జెండా ఆవిష్కరించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో జెడ్‌పిటిసి సభ్యులు గుంటురి పెద్దిరాజు, ఎంపిపి సబ్బితి సుమంగళి, ఎంపిడిఒ డి.సుహాసిని, వైస్ ఎంపిపి ఇందుకూరి సీతారామరాజు, సర్పంచి సువర్ణ రాజు పాల్గొన్నారు. మండలంలోని కవిటంలో పరకాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రముఖ వైద్యులు పోడూరి కృష్ణమూర్తి, ఎస్‌బిఐ బ్రాంచ్ మేనేజర్ సతీష్‌శర్మ ముఖ్య అతిథిలుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరకాల ట్రస్ట్ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, చాక్లెట్లు, బిస్కెట్లు అందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, మహిళా మండలి భవన్ వద్ద పరకాల ట్రస్ట్ ఆధ్వర్యంలోవ్యాధి నిరోధక శక్తిని పెంచే హోమియోపతి మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు. వీరవాసరం :మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపిడిఒ జ్యోతి, తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ సుందర్‌రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆచంట : మండలంలోని ఆచంట, కొడమంచిలి, పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, భీమలాపురం, వల్లూరు, పెనుమంచిలి, ఆచంట వేమవరం, శేషమ్మ చెరువు, అయోధ్య లంక గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు కళాశాల, పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఎగరవేశారు. ఎంపిడిఒ నరసింహప్రసాద్ మాట్లాడారు. నరసాపురం : ఆంధ్ర బ్లైండ్ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన వేడుకులకు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు యుకె వనితా క్లబ్ రీజనల్ చైర్‌పర్సన్ డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు వనితా క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు, స్వీట్లు అందించారు. పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు పతాకావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి వెంకటరమణ, కౌన్సిల్ సభ్యులు కోఆప్టేడ్ మెంబర్లు హాజరయ్యారు. అనంతరం సన్మానం, బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వీరవెల్లి సురేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బిజిబిస్ ఉమెన్స్ కాలేజీలో కళాశాల ఛైర్మన్ నూలి శ్రీనివాస్ జెండా ఎగురవేశారు. కోర్టుల ప్రాంగణంలో పదో అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ విజయదుర్గ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాలకోడేరు : మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒ నాగేంద్రకుమార్ జెండా ఆవిష్కరించారు. ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు), జెడ్‌పిటిసి సభ్యులు లక్ష్మీతులసిలు గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పులమాల వేసి నివాళులర్పించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాసరావు, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ షేక్ హుస్సేన్ జెండా ఆవిష్కరించారు. కాళ్ల : కోపల్లె ఎస్‌ఎండిఆర్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పతాకావిష్కరణ అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యా యులు కె.నిర్మలాదేవి అధ్యక్షత వహించారు. ఐక్య నేషనల్ ఫౌండేషన్, నల్ల విజయలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు విద్యార్థులను తయారు చేసిన సత్యలక్ష్మి టీచర్‌ను అభినందించారు. తాడేపల్లిగూడెం : ఎపి నిట్‌లోని పరిపాలనా భవనంలో నిర్వహించిన వేడుకల్లో నిట్ డీన్ రీసెర్చ్, కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్‌కె.శాస్తి, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడారు. శశి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన వేడకల్లో విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రిన్సిపల్ మహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడారు. ఎన్‌సిసి అధికారి లెఫ్టినెంట్ పిఎస్.శేఖర్ 80 క్యాడెట్స్‌చే మార్చ్ ఫాస్ట్ చేయించారు. తణుకు రూరల్ : ఎస్‌కెఎస్‌డి మహిళా డిగ్రీ, పీజీ(అటానమస్), గ్రూఫ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా తహాశీల్దార్ పిఎన్‌డి.ప్రసాద్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండలంలోని సజ్జాపురంలోని ఆదిత్య స్కూల్ విద్యార్థులు 300 అడుగల జాతీయ జెండాతో స్కూల్ క్యాంపస్ నుంచి నరేంద్ర సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి వంకా రవీంద్రనాధ్ మాట్లాడారు.మొగల్తూరు : ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ ఉండ్రు బాబ్జిరాజు, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ జి.అనితకుమారి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ అబ్దుల్ రజాక్, ఐసిడిఎస్ కార్యాలయంలో సూపర్‌వైజర్ పద్మావతి, పెనుమత్స రంగరాజా జెడ్‌పి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వర్ధమాని రవిశంకర్ సర్కార్, పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి జయరాజు జాతీయ పతాకావిష్కరణలు చేశారు.యలమంచిలి : స్థానిక ఎంపిడిఒ, తహశీల్దార్ కార్యాలయాల్లో, యలమంచిలి పోలీస్‌స్టేషన్ వద్ద త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ఆకివీడు : మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపిపి జయలక్ష్మి, ఎంపిడిఒ వాణి, తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ విజయలక్ష్మి, విద్యావికాస్ కళాశాల వద్ద ప్రిన్సిపల్ బలరాంబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు.తణుకు : స్థానిక వైసిపి కార్యాలయం వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. టిడిపి కార్యాలయం వద్ద మాజీ ఎంఎల్‌ఎ రాధాకృష్ణ, వైసిపి కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామచంద్రరావు, మాంటిస్సోరి స్కూల్ వద్ద స్కూల్ డైరెక్టర్ వనపర్తి ప్రకాష్‌రావు జెండాను ఎగురవేశారు.పాలకొల్లు : వైసిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో గోపీ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు యడ్ల శివాజీ, ఎల్‌ఆర్.పేటలోని మాంటిస్సోరి స్కూలు మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్, పాలకొల్లు సన్ షైన్ స్కూల్లో కరస్పాండెంట్ ఎన్‌విఎస్.పాపారావునాయుడు జెండా ఆవిష్కరించారు. మండలవ్యాప్తంగా పలుచోట్ల జెండా ఆవిష్కరించారు.
