18న చలో ఢిల్లీ

ప్రజాశక్తి – భీమవరం
ఈ నెల 18వ తేదీన చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పివి.రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మాపు సూర్యవరప్రసాద్‌, పొన్నమండ బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎస్‌సి వర్గీకరణ జోలికి వస్తే బిజెపిని భూస్థాపితం చేస్తామన్నారు. భీమవరంలో పివి.రావు మాల మహానాడు రాష్ట్ర అత్యవసర సమావేశాన్ని బాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి మత కల్లోలాలను సృష్టిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఒక కులానికి భుజం కాస్తూ వ్యవహరించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ నెల 18న చేపట్టబోయే చలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోడి పెద్దిరాజు, కార్యదర్శి కొర్రపాటి వీరస్వామి, మీడియా కో-ఆర్డినేటర్‌ దేవా రాజేష్‌, నాయకులు నేలపాటి రాజబాబు, కుమార్‌ స్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.నూతన జిల్లా కమిటీ ఎన్నికస్థానిక కార్యాలయంలో పివి.రావు మాల మహానాడు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బండి శ్యాంబాబు, రాష్ట్ర కార్యదర్శిగా పిల్లి ముసలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుంగ ఆదాముతో పాటు మరి కొంతమంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యవరప్రసాద్‌, బాలకృష్ణ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందించారు.

➡️