కలెక్టర్ నాగారాణి
ప్రజాశక్తి – భీమవరం
పిజిఆర్‌ఎస్‌లో ప్రజలు అందజేసిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కారం చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. తహశీల్దార్లు ప్రతి అర్జీనీ పరిశీలించి ఎండార్స్మెంట్లను ఇవ్వాలన్నారు. సంబంధిత ఆర్‌డిఒ వారి పరిధిలోని మండలాల్లో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు. రీఓపెన్‌కు అవకాశం లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 367 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, కెఆర్‌ఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కెసిహెచ్ అప్పారావు పాల్గొన్నారు.