బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌

చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చోటుచేసుకుంది. ఆగర్తి పాలెం గ్రామానికి చెందిన వీరవల్లి దుర్గారావు(30) శనివారం సాయంత్రం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ఆదివారం ఉదయం గ్రామస్తులకు తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దుర్గారావుకు భార్య ఉంది. పిల్లలు లేరు. తాపీ పని చేస్తూ ఉంటాడు. భార్య వాలంటీర్‌గా పనిచేస్తుంది. చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అని , తన పని తాను చేసుకుంటూ అందరికీ సహాయం చేసే మంచి వ్యక్తి అని, ఆదివారం ఉదయం నుంచి చించినాడ బ్రిడ్జి వద్ద గోదావరిలో మృతదేహం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

➡️