శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

ప్రజాశక్తి – కాళ్ల

ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని స్కూల్‌ కాంప్లెక్స్‌ ఛైర్మన్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు జెఎల్‌ ఎన్‌.శాస్త్రి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి టెస్ట్‌ కాళ్ల హైస్కూల్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కోపల్లె విద్యార్థులు లిఖిత దుర్గ, యశస్విని, భార్గవ ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానాన్ని, వెస్ట్‌ బెర్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శ్రీకర్‌, బలరామకృష్ణ, షణ్ముఖ వర్మ ప్రయివేటు పాఠశాల విభాగంలో ప్రథమ స్థానాన్ని పొందినట్లు చెకుముకి మండల కన్వీనర్‌ బొబ్బిలి రాజమౌళి కోటేశ్వరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్వామి మాస్టారు సౌజన్యంతో ఏర్పాటు చేసిన జ్ఞాపికలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి ఎం.శంకర్‌, ఉపాధ్యాయులు ధర్మరాజు, కిషోర్‌కుమార్‌, ప్రసాద్‌, విజరు కుమార్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️