ప్రజాశక్తి – పోడూరు
జిన్నూరు గ్రామ ప్రముఖులు, మాజీ సొసైటీ అధ్యక్షులు, కీర్తిశేషులు కొప్పర్తి సూర్యనారాయణ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం జిల్లా స్థాయి ప్రజాచైతన్య సైకిల్ యాత్ర జిన్నూరు విచ్చేసిన సందర్భంగా యాత్ర బృందానికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసిన సూర్యనారాయణ విగ్రహం వద్ద యాత్ర బృందం నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిన్నూరు గ్రామ కార్యదర్శి కొప్పర్తి నరసింహమూర్తి, సీనియర్ నాయకులు తాళ్లాబత్తుల గాంధీ, గుబ్బల గంగాజలం, చివటపు ఆంజనేయులు, దాడి గౌరమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.