పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఉండి: మండలంలోని మహదేవపట్నం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివిన 1993-94 పదో తరగతి బ్యాచ్‌కి చెందిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించి పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వారు బాల్య స్మృతులను నెమరువేసుకుంటూ ఒకరినొకరు ఆలింగణం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ సరస్వతి దేవి పూజ చేసుకునే రోజున సరస్వతీ దేవి విగ్రహాన్ని పాఠశాలకు బహూకరించడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ తాము చదువుకున్న పాఠశాలకు ఏదో ఒక రూపంలో సహకరిస్తే పాఠశాలల అభివృద్ధి జరుగుతుందన్నారు.

➡️