రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలి

ప్రజాశక్తి – ఉండి

ఎంఎల్‌ఎ కనుమూరు రఘురామకృష్ణంరాజు అంబేద్కర్‌ ఫ్లెక్సీని తొలగించడం అంబేద్కర్‌ను ఘోరంగా అవమానించడమేనని, ఈ తప్పును ఎంఎల్‌ఎ కనుమూరి రఘురామకృష్ణంరాజు అంగీకరించాలని కెవిపిఎస్‌ మండల కార్యదర్శి మాదాసి గోపి డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని పాందువ్వ, యండగండి గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహానికి కెవిపిఎస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ మండల కార్యదర్శి మాదాసి గోపి మాట్లాడుతూ ఎంఎల్‌ఎ అంబేద్కర్‌ ఫ్లెక్సీని తొలగించడం ఆయనను అవమానించడమే అన్నారు. అంబేద్కర్‌ను కేవలం దళితులకే చెందిన వారిగా ముద్ర వేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ మండల నాయకులు తాడి కుమార్‌, ఎం.రామయ్య, గ్రామ నాయకులు ఎం.ప్రశాంత్‌, సిహెచ్‌ చిట్టిబాబు, డి.దుర్గాప్రసాద్‌, ఎం.పూర్ణ, ఎన్‌.సుబ్రహ్మణ్యం, శివకృష్ణ, లక్ష్మణరావు, జి.కాసులు, కన్నయ్య, రమేష్‌, పండు, కె.శ్రీను, నాగరాజు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.యలమంచిలి : ఏలూరుపాడులో అంబేద్కర్‌ ఫ్లెక్సీని తొలగించిన ఎంఎల్‌ఎ రఘురామకృష్ణంరాజుపై ప్రభుత్వం వెంటనే ఎస్‌సి, ఎస్‌టి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కెవిపిఎస్‌ జిల్లా నాయకులు కానేటి బాలరాజు డిమాండ్‌ చేశారు, ఆదివారం సాయంత్రం మండలంలోని చించినాడ గ్రామంలో అరుంధతీపేట చిల్డ్రన్స్‌ పార్క్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ప్రభుత్వం ఆయనపై ఎస్‌సి, ఎస్‌టి, అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్ల ఏడుకొండల శ్రీనివాస్‌, ముమ్మిడివరపు ఆంజనేయులు, గోగినేని శ్రీనివాస్‌, తెన్నేటి స్టాలిన్‌, తాడి ఉదరు, పల్లేరు అనిల్‌, ఆకుమర్తి పద్మరాజు, ఆకుమర్తి జోసెఫ్‌, టి.జయరాజు, జి.ఫణీంద్ర పాల్గొన్నారు.

➡️