ప్రజాశక్తి – భీమవరం టౌన్
గతేడాది అక్టోబర్‌లో లిటిల్ ఛాంప్స్ హైదరాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి తెలుగు ఒలింపియాడ్‌లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌తో పాటు, ఆరో ర్యాంకు సాధించారని ఆదిత్య స్కూల్ కస్పాండెంట్, లయన్ కృష్ణంరాజు తెలిపారు. మంగళవారం స్కూల్లో ప్రతిభ కనబర్చిన జె.సాయి సిద్ధిక్ష, కె.రోహితశ్రీ సంజనను అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ తమ విద్యార్థులు చదువు, క్రీడలు, సాంస్కృతిక పోటీల్లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ప్రతిభ చూపెడుతున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి.శ్రీనివాస్, బి.యుగసుధ, కె.సత్యనారాయణ, దుర్గాంబ విద్యార్థులను అభినందించారు.