మహిళా డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్‌ దినోత్సవం

పాలకొల్లు : పాలకొల్లు శ్రీ దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌, యునైటెడ్‌ కాపు వనిత క్లబ్‌ సంయుక్త నిర్వహణలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణ హాస్పిటల్‌ వైద్యులు అనుపమ మాట్లాడుతూ ఎయిడ్స్‌ సంక్రమణం, నివారణ గురించిన విషయాలపై అవగాహన కలిగించారు. ఎయిడ్స్‌ అంటు వ్యాధి కాదని, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పట్ల సానుభూతి కలిగి ఉండాలని కోరారు. వ్యాధి సంక్రమించిన వారు భయపడకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. చిత్రలేఖనం, రీల్‌ మేకింగ్‌, పోస్టర్‌ ప్రెజెంటేషన్‌, డిబేట్‌, రంగోలి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శోభారాణి, వైస్‌ ప్రిన్సిపల్‌ రవిశంకర్‌ పాల్గొన్నారు.

➡️