కూటమి విజయోత్సవ సంబరాలు

ప్రజాశక్తి – ఉండి

కూటమి విజయోత్సవ సంబరాల్లో భాగంగా సోమవారం టిడిపి ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉండి పురవీధుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి జనసేన ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్‌ కళ మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనకు విసుగు చెందిన ప్రజలు ఏకతాటి పైకి వచ్చి టిడిపి కూటమిని అధికారంలోకి తీసుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీని ఉండి ఎంఎల్‌ఎ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు కట్టబెట్టారన్నారు. ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపేందుకే విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చెన్నంశెట్టి హరినాయుడు, జనసేన మండల అధ్యక్షులు యడవల్లి వెంకటేశ్వరరావు, బిజెపి మండల అధ్యక్షులు యర్రా విక్రమ్‌, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, నాయకులు కాగిత మహంకాళి, మంతెన సాయి లచ్చిరాజు, కాగిత బుజ్జి, కరిమెరక శ్రీనివాస్‌, రుద్రరాజు యువరాజు, మజ్జి కృష్ణప్రసాద్‌, కర్రి శ్రీనివాస్‌, కురిటి అప్పారావు, మోపిదేవి హరి పాల్గొన్నారు.

➡️