అంబేద్కర్ చిత్రాన్ని గీసిన విద్యార్థి డాని ఫిన్హాన్
ప్రజాశక్తి – పాలకోడేరు
శృంగవృక్షం పాలపర్తి పేటకు చెందిన విద్యార్థి పాలపర్తి డాని ఫిన్హాస్ అంబేద్కర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. తాను చదువుకునే పుస్తకంలో ఒక పేజీని తీసుకుని అంబేద్కర్ చిత్రాన్ని గీసి దానికి రంగులు అద్ది అంబేద్కర్ గొప్పదనాన్ని తెలియపరిచాడు. తన తండ్రి ప్రదీప్, జ్యోతి, తాతయ్య బాబ్జి అంబేద్కర్ గురించి తరచూ చెబుతుంటారని, ఆయన ప్రపంచానికి అందించిన సేవలకు గుర్తుగా అంబేద్కర్ చిత్రాన్ని గీయడం జరిగిందని విద్యార్థి డానీ ఫిన్హాస్ తెలిపారు. శృంగవృక్షం 12 పేటల ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో విద్యార్థి గీసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.