అంబేద్కర్‌ అందరివాడు

విగ్రహావిష్కరణలో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు

ఆచంట : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయలు యువతకు మార్గదర్శకమని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభమండలి చైర్మన్‌ కొయ్య మోషన్‌ రాజు అన్నారు. ఆచంట నియోజకవర్గంలోని మాల సంఘాల జెఎసి, నిర్వహణ కమిటీ అధ్యక్షులు సుంకర సీతారామ్‌ ఆధ్వర్యంలో సర్పంచి కోట సరోజినీ వెంకటేశ్వర అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆచంటలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొయ్యే మోసేన్‌ రాజు పాల్గొని మాట్లాడుతూ పేదల ఆశాజ్యోతి, అంబేద్కర్‌ బాటను నేటితరం నేతలు ఆచరించాలని పిలుపునిచ్చారు. డాక్టర్‌ సరళ పురుషోత్తం, జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ గుమ్మపు సూర్య వరప్రసాద్‌, జిల్లెల్ల సత్య సుధా, ఉన్నమట్ల మునిబాబు, యాదల రవి పాల్గొన్నారు.

➡️