పాలకోడేరు : అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కోరుకొల్లులో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ మండపాన్ని గ్రామ సర్పంచి మంతెన భారతి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంతెన వెంకట ప్రహ్లాదరాజు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ మంతెన యోగీంద్రబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. అంబేద్కర్ ఒక మతానికో, కులానికో, వర్గానికో చెందిననవాడు కాదని యావత్తు ప్రపంచానికి చెందిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి సిహెచ్ ఎస్.రామాంజనేయరాజు(చంటరాజు), పంచాయతీ కార్యదర్శి కె.సుజాత, పంచాయతీ వార్డు సభ్యులు సంబలదేవి చంటి, కె.భూలక్ష్మి, బక్కే అనూప్, తాండ్ర ఆదినారాయణ, పెన్మెత్స భీమరాజు, ఉద్దరాజు సుబ్బరాజు, తంగెళ్ల ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు.
