ప్రజాశక్తి -గణపవరం : బడుగు బలహినుల అభివృద్ధికి కృషి చేసిన అంబేద్కర్ ఆశయసాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉంగూటూరు మాజీ శాసన సభ్యులు వైఎస్సార్ నాయకులు పుప్పాల శ్రీనివాస్ రావు(వాసుబాబు) అన్నారు. అంబెద్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్తానిక దళిత పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘణంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగుల జీవీతాలు మార్చడానికీ అంబేద్కర్ చేసిన పోరాటం నేటి యువత కు ఆదర్సంమని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం నేటి పాలకులుఅమలు చేసి బడుగు బలహినుల అబివ్రుద్దికి క్రుషి చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచి మూరా అలంకారం వైసిపి మండల అద్యక్షులు దండురాము శెట్టి రాజు రోంగలశ్రీను మండలంలో వైఎస్సార్ నాయకులు పాల్గొన్నారు.
