పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

ప్రజాశక్తి – వీరవాసరం

    వీరవాసరం ఎ ంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ అపూర్వ కలయికకు వేదికైంది. 1986-87 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వపు విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. సుమారు ముఫ్పై నాలుగు సంవత్సరాల తరువాత కలుసుకున్న నాటి విద్యార్థులు భావోద్వేగాలను పంచుకుంటూ ఒక రోజంతా గడిపారు. నాటి తరగతి గదులలో పంచుకున్న విశేషాలను, ఆనాటి గురుతులను నెమరువేసుకుంటూ ఒకరినొకరు కులాస ప్రశ్నలు వేసుకుంటూ ఒక మధురానుభూతిని పొందారు. ఈ అపూర్వ కలయికకు 2018లో ఈ బ్యాచ్‌కు చెందిన వలవల జానకీరామ్‌ ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి నాంది పలికాడు. దీనిని స్థానికంగా ఉండే ముద్రగళ శ్రీనివాస్‌, యేలూరి భానుకుమారి, మల్లుల జైకృష్ణ, శనివారపు ప్రసాదు, నిమ్మల దుర్గ అందిపుచ్చుకుని పూర్వపు విద్యార్థుల చిరనామాలు తెలుసుకోవడం ద్వారా వీరి కలయిక సాధ్యమైంది. ఎంతో ఉల్లాసభరతంగా గడిపిన వీరు అనేక తరాలకు సుపరిచుతుడైన అప్పటి స్కూల్‌ స్వీపర్‌ మద్దాల రామకృష్ణను సత్కారించి రూ.ఐదు వేలు నగదు బహమతి అందజేశారు. వచ్చే సంక్రాంతికి మరోసారి కలుసుకుని తమ గురువులను సత్కారించుకోవాలనే తలంపుతో భారమైన మనసుతో వెనుదిరిగారు.

➡️