జంతు వధ నేరమంటూ ర్యాలీ

 

జాశక్తి – భీమవరం టౌన్‌

జంతువుల వధ, జంతువుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మురళీకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధకశాఖ, జిల్లా జంతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతువధ నిషేధించాలి అంటూ పట్టణంలో మంగళవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్‌ జాఫర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ జంతువులను ప్రేమించడం మానవ ధర్మమన్నారు. చెరుకువాడ రంగసాయి గోవధ నిషేధ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణ, లయన్స్‌ క్లబ్‌ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️