సుందరంగా సీసీ రహదారులు

Mar 1,2024 12:40 #West Godavari District
Beautiful CC roads

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : సీసీ రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 27వ వార్డు ధర్మపురి నగర్ లో రూ.18.40లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ,మిగిలిన రోడ్లన్నింటి త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బర్రె వెంకట రమణ, కమీషనర్ కె.వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు గోరు సత్తిబాబు, కేసరి గంగరాజు, జిల్లెల దిలీప్ కుమార్, నాయకులు కావలి నాని, కామన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

➡️