భరత్‌ కృతజ్ఞత పర్యటన

ఆకివీడు: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా ఎన్నికైన కనుమూరు రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్‌ పట్టణంలో కృతజ్ఞతా పర్యటన నిర్వహించారు. సోమవారం రాత్రి పట్టణంలోని పలు వీధుల్లో ఆయన ఈ పర్యటన జరిపారు. ముందుగా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో భరత్‌కు కూటమి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు పాల్గొన్నారు.

➡️