శతాధికవృద్ధురాలు సత్యవతి మృతి

పెనుమంట్ర : మండలంలోని పొలమూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు తాడాల సత్యవతి(103) శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈమె భర్త తాడాల రామ్మూర్తి కాగా, ఇద్దరూ సిపిఎం సానుభూతిపరులు కావడం విశేషం. సత్యవతికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మనువళ్లు, మనువరాళ్లు, ముని మనువళ్లు ఉన్నారు. ఆమె పెద్ద కుమారుడు తాడాల సత్యనారాయణ మూర్తి ఎక్స్‌ మిల్ట్రీ కెప్టెన్‌గా 1971 కార్గిల్‌ వార్‌ పనిచేశారు. ఆయన ఆర్మీలో 30 సంవత్సరాలు దేశానికి సేవలు అందించారు. రెండో కుమారుడు తాడల రామకృష్ణ డిప్యూటీ కమిషనర్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె కటిక రెడ్డి సూర్యవతి పొలమూరు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో సైన్స్‌ టీచర్‌గా పని చేశారు. రెండో అమ్మాయి విద్యావతి, మూడో అమ్మాయి యర్రంశెట్టి గిరిజావతి. శతాధిక సంవత్సరాల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా ఉండే సత్యవతి మృతి చెందడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలిపారు.

➡️