నాయకర్‌ను కలిసిన చాగంటి

ప్రజాశక్తి – నరసాపురం

నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా ఎన్నికైన బొమ్మిడి నాయకర్‌ను జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ(చిన్న) ఆదివారం అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంఎల్‌ఎగా భారీ మెజారిటీతో గెలిచినందుకు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నరసాపురంలో జనసేన పాత్ర గురించి చర్చించారు. జనసేన, టిడిపి, బిజెపి సమిష్టిగా కృషి చేయడంతో ఈ గెలుపు సాధ్యమైనందన్నారు. టిడిని, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు, నియోజకవర్గ ప్రముఖులు నాయకర్‌ను అభినందించారు.

➡️