పరిశుభ్రతతో వ్యాధులు దూరం

ప్రజాశక్తి – కాళ్ల

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సీజనల్‌ వ్యాధులను దూరం చేయవచ్చని కాళ్ల పిహెచ్‌సి వైద్యాధికారి సరాబు సునీల్‌ తెలిపారు. మంగళవారం మలేరియా వ్యతిరేక మాస్సోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సరాబు సునీల్‌ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ప్రతి శుక్రవారమూ ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. లార్వా సర్వే నిర్వహించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గుంతల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్‌, క్రూడ్‌ ఆయిల్‌ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని చెప్పారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ విజయవతి, పిఎన్‌సి చండీరాణి, ఎంపిహెచ్‌ఇఒ పాల్సన్‌, హెచ్‌విలు సుబ్బలక్ష్మి, పరంజ్యోతి, ఎఎన్‌ఎమ్‌లు ఆశా వర్కర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️