తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ప్రజాశక్తి-ఉండి: ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మరమ్మత్తుల పేరిట 165 జాతీయ రహదారిలోని ఉండి రైల్వే గేటు మూసివేయడంతో ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైల్వే ట్రాక్ మరమ్మత్తులు చేయడం ఉత్తమమైనదే అయినప్పటికీ ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయకుండా గేటు మూసివేయడం సరికాదని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి పూర్తి కాకపోవడం వల్ల రైల్వే గేట్ సమీపంలోని రహదారి మొత్తం అద్వాన స్థితికి చేరినప్పటికీ తప్పని పరిస్థితుల్లో తమ ప్రయాణం సాగిస్తున్నామని ప్రస్తుతం గేటు మూసివేయడంతో గేటు అవతలి వైపుకు వెళ్లడానికి సుమారు పది కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్లాల్సి వస్తుందని అధికారులు తమకు సైకిల్ వెళ్లే మార్గం అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.