ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం టౌన్
కేరళ బాధితులను ఆదుకోవాలని కోరుతూ తాలూకా రైల్వే గుడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద యూనియన్ అధ్యక్ష కార్యదర్శి సత్తి కోదండరామిరెడ్డి, చిర్ల పుల్లారెడ్డి మంగళవారం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే గుడ్స్ షెడ్ కార్మికులు వారు వేతనాలు ఉపాధి కాకుండా ఆపదలో ఉన్న సమాజాన్ని ఆదుకోవడం కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. కేరళలో జరిగిన జల ప్రళయానికి వయనాడు జిల్లాలో సుమారు 300 మందిపైగానే మరణించారని తెలిపారు. ఈ నేపథ్యంలో శరణార్థుల కోసం అక్కడున్న సిపిఎం ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి లక్షల మందికి పునరావాసం కల్పిస్తోందని తెలిపారు. వారికి ఆదుకోవడానికి రైల్వే గుడ్స్ షెడ్ వారికి వచ్చిన ఆదాయంలో కొంత విరాళాల రూపంలో సహాయం అందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విఎస్.రెడ్డి, కర్రి సాయిరెడ్డి, అడపా ఆంజనేయులు, కర్రి సుబ్బిరెడ్డి, ఆకులు నారాయణ, అడగర్ల కృష్ణ, మద్దాల పుత్రయ్య, బుద్దాల నాని, గాది వెంకటరావు కర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎండ్రపు కృష్ణ, సత్తి దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు, దుర్గ పాల్గొన్నారు.పాలకొల్లు : కేరళ వరద బాధితుల కోసం పాలకొల్లు సిపిఎం కార్యకర్తలు మంగళవారం విరాళాలు సేకరించారు. రూ.4,600 వసూలైనట్లు సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు రండి కృష్ణ, కృష్ణ భగవాన్, ప్రసాద్ పాల్గొన్నారు.పాలకోడేరు : కేరళలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు వయనాడు అతలాకుతలం అవ్వడమే కాకుండా వందల మంది ప్రాణాలు కోల్పోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సిపిఎం మండల కార్యదర్శి శేషాపు అశ్రియ కోరారు. మంగళవారం మోగల్లులో సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు స్వీకరించారు. స్థానిక సెంటర్లో షాపులతోపాటు ఇంటింటా తిరిగి జోలు పట్టి సిపిఎం నాయకులు, కార్యకర్తలు విరాళాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అశ్రియ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల వెంకటస్వామి, దున్న మరియమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.