మున్సిపల్‌ స్కూల్‌లో కమిషనర్‌ తనిఖీ

ప్రజాశక్తి – నరసాపురం

పట్టణంలోని 12 వ వార్డ్‌ అడ్డగళ్ల వారి వీధిలో ఉన్న మున్సిపల్‌ ప్రైమరీ ఇంగ్లీష్‌ స్కూల్‌ను సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.అంజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు పట్టీలను, విద్యార్థుల సంఖ్యలను, పాఠశాల పరిసరాలను కమిషనర్‌ పరిశీలించారు. కరెంట్‌ బిల్లులు, ఆయాలకి జీతలపై ఆరా తీసి, బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్నం భోజనం ఎలా వుంటుందని కమిషనర్‌ స్వయంగా రుచి చూశారు. ఉపాధ్యాయుల పనితీరుపై కమిషనర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వెంపరాల సూర్య సత్య నాగలక్ష్మి పాల్గొన్నారు.

➡️