ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
ఈ నెల 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవం, 30న విశ్వవసు ఉగాది సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవితల పోటీ నిర్వహించనున్నట్లు శ్రీశ్రీ కళావేదిక కన్వీనర్ కొల్లి రమావతి తెలిపారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీశ్రీ కళావేదిక నిరంతర సాహిత్యక్రతువులో భాగంగా కవులందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కవితల పోటీల్లో విజేతలైనవారికి మొదటి బహుమతి 2000 రూపాయలు, ద్వితీయ బహుమతి 1500 రూపాయలు, తృతీయ బహుమతి 1000 రూపాయలు, నాలుగో బహుమతి రూ.600తోపాటు పది మందికి 500 చొప్పున కన్సొలేషన్ బహుమతులు ఇవ్వనున్నట్లు అమె తెలిపారు.