కొనసాగిన వేసవి విజ్ఞాన శిబిరం

ప్రజాశక్తి – నరసాపురం

నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతుల సందర్భంగా పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంగళవారం విద్యార్థులు పోటా పోటీగా పుస్తకాలు చదివారు. రిసోర్స్‌ పర్సన్‌ బార్క్‌ సీనియర్‌ శాస్త్రవేత్త రంగినీడి సుబ్బారావు పిల్లలుకు ఇష్టమైన కథలు వివరించి వాటిలో ఉన్న నీతిని వారికి తెలియజేసి కథలు చదవడంతో ఊహ శక్తి పెరుగుతుందన్నారు. భాష, భావవ్యక్తీకరణ స్పష్టంగా ఉంటాయి. స్ఫూర్తినిచ్చే కథలు దేశ నాయకులు, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కథలు, వారి చరిత్రలు లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఈద ప్రకాశం రిటైర్డ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫీసర్‌ సుధీర్‌ మోహన్‌, సూర్యం బాబు పాల్గొన్నారు. ఈ సమ్మర్‌ క్యాంపు జూన్‌ 7వ తేదీ వరకు కొనసాగుతుందని పిల్లలు పాల్గొనవలసిందిగా గ్రేడ్‌ వన్‌ లైబ్రేరియన్‌ కెజెఎస్‌ఎల్‌ కుమారి తెలిపారు.

➡️