పుంత రోడ్ల అభివృద్ధి కోరుతూ సిపిఎం నిరసన

ప్రజాశక్తి – మొగల్తూరు

పుంత రోడ్లను అభివృద్ధి చేయాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని కెపిపాలెం నార్త్‌ పంచాయతీ పరిధిలోని పంట కాలవ గట్లు గల పుంత రోడ్లను, మెట్టిరేవు నుండి పావురాల వారి మెరక వరకు గల పంట కాలువ పక్క గల రోడ్లను నిర్మించాలని సిపిఎం నాయకులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత యడ్ల చిట్టిబాబు మాట్లాడుతూ కొంతకాలంగా పంట కాలవ పక్కన రోడ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో ఆ రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువ గట్లు, లింకు రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సచివాలయ కార్యాలయ సిబ్బందికి అందించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొత్తపల్లి నాగరాజు, మువ్వల రాజారావు, కొల్లాటి బాబూరావు పాల్గొన్నారు.

➡️