యలమంచిలి : మండలంలోని చించినాడ గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరుడు నరసింహ స్వామి మృతి బాధాకరమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన నరసింహ స్వామి మృతదేహాన్ని గురువారం సిపిఎం శ్రేణులతో కలిసి బలరాం సందర్శించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ పూర్వం నుంచి సిపిఎంకు అండగా నిలుస్తున్న కుటుంబానికి చెందిన నర్సింహాస్వామి పిన్నవయసులోనే మృతిచెందడం ఆ కుటుంబానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులు ఈశ్వరుడు, ఆంజనేయులను ఓదార్చారు. ఆయన వెంట నాయకులు కౌరు పెద్దిరాజు, కె.క్రాంతి బాబు, కేతా సూర్యారావు, కె.బాలరాజు, బి.జార్జి, డి.సుధాకర్, జె.ప్రశాంతి, బి.సుగుణ, వడ్డి కాసులు ఉన్నారు.