డాగ్యురే ధన్యజీవి

భీమడోలు: ఫొటోగ్రాఫర్లకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కల్పించడంతోపాటు, వారి ఉపాధికి సహకరిస్తున్న ఫొటోగ్రఫీ సృష్టికర్తల్లో ఒకరైన లూయిస్‌ డాగ్యురే ధన్యజీవి అని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. భీమడోలు సర్కిల్‌ ఫొటోగ్రాఫర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో భీమడోలు లోని అబ్దుల్‌ కలాం, డాగ్యురే వేదిక వద్ద బుధవారం డాగ్యురే 173వ వర్ధంతి కార్యక్రమాన్ని యూనియన్‌ అధ్యక్షులు డి.శ్రీరామ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఫొటోగ్రాఫర్లు డాగ్యురే విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఆయనకు నివాళులు సమర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి.రామ్మూర్తి, ఎ.రంగారావు, నరేష్‌ పాల్గొన్నారు.

➡️