పాలకొల్లు డిఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్లు

Jun 10,2024 16:58 #West Godavari District

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో నాక్ బి ++ పొందిన డిఎన్ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్ పాసైన విద్యార్థినులకు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుచున్నట్లు ప్రిన్సిపల్ డా శోభారాణి తెలిపారు. బి.ఎ.ఎకనమిక్స్(మేజర్), బి.యస్సి, ఎమ్.పి.సి. కెమిస్ట్రీ (మేజర్), బి.యస్సి. జువాలజి(మేజర్), బి.యస్సి.ఎమ్.పి.సి.ఎస్. కంప్యూటర్(మేజర్), బి.కామ్.కంప్యూటర్(మేజర్). కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ పాసైన మహిళా అభ్యర్థులు అర్హులు. పైకోర్సులకు ప్రభుత్వం నిర్టయించిన ఫీజులు మాత్రమే తీసుకొనబడును. అర్హులైన విద్యార్థినులకు ప్రభుత్వ స్కాలర్ షిప్ లు అందించబడును. రక్షిత మంచినీరు, అధునాతన వాష్ రూమ్స్, డిజిటల్ విద్యా బోధన, డిజిటల్ లైబ్రరీ, అధునాతన సెమినార్ హాల్, లేబరేటరీలు, గ్రీన్ హౌస్ కళాశాలలో కలవు. 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్, ఇంటర్ మార్కులు, టి.సి, 10 వ తరగతి మార్కులు ఒరిజినల్, గుర్తింపు ఫొటోస్టాట్ కాపీలు తెచ్చుకొన వలెనని కోరారు. సంప్రదించాల్సిన నెంబర్లు 6302194657, 7406547372 అని తెలిపారు.

➡️