కార్మికుల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పదిలం

సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి

ప్రజాశక్తి – నూజివీడు

కార్మికుల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పదిలమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. నూజివీడు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాజు అధ్యక్షతన సిపిఎం శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం, ఆశయాలు, లక్ష్యాలు, ప్రజల తరపున చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను వివరించారు. కార్మికులను సంఘటిత పరచి వారి సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేసి సాధించిన ఘన చరిత్ర సిపిఎంకి ఉందన్నారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుందని తెలిపారు.

➡️