పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని ధర్నా

ప్రజాశక్తి – కాళ్ల

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ డిమాండ్‌ చేశారు. జువ్వలపాలెం సిపిఎం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మండా సూరిబాబు, తిరుమాని శ్రీనివాస్‌, గండికోట వెంకటేశ్వరరావు, గాతల ఆల్‌ ఫ్రెంచ్‌, తిరుమాని సుబ్బారావు, గాంధీ పాల్గొన్నారు.

పాలకోడేరు : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి శేషాపు అశ్రియ్య డిమాండ్‌ చేశారు. విస్సాకోడేరు రావి చెట్టు సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారాలతో సామాన్య ప్రజలు ఎలా జీవించాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. పెరిగిన ధరలతో సతమతమవుతుంటే మళ్లీ గ్యాస్‌, పెట్రోల్‌చ డీజిల్‌ ధరలు పెంచడం దారుణమన్నారు. ధరలు తగ్గించాలని, లేకుంటే ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కలిదిండి గోపాలరాజు, సత్యనారాయణ, గోపి పాల్గొన్నారు.

➡️