డయేరియాపై అవగాహన

ఉండి: ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో పోషకాహార లోపం వల్ల డయేరియా వ్యాధి వస్తుందని యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ బెన్నీ శామ్యూల్‌ అన్నారు. డయేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉండి మండలం యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియాపై బాలలు, వారి తల్లిదండ్రులకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బెన్నీ సామ్యూల్‌ మాట్లాడుతూ డయేరియా టైగర్‌ దోమ కాటు వల్ల వస్తుందని, ఈ దోమ పగటిపూట మాత్రమే సంచరిస్తుందని, వీటిని సంహరించాలంటే నీటి నిల్వలు, పరిసరాల అపరిశుభ్రత ఉన్నచోట యాంటీ లార్వెల్‌ ఆపరేషన్‌ ద్వారా స్ప్రేయింగ్‌ చేయాలని ఆయన సూచించారు.

➡️